సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం తదితర నిషేధ క్రీడలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం రొంపిచర్ల ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. ఆయన పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ కోడిపందాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. నిర్మానుష ప్రదేశాలలో డ్రోన్స్ తో నిఘ ఏర్పాటు చేసినట్లు వివరించారు.