వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18న సత్తెనపల్లిలో పర్యటించిన సందర్భంగా, పోలీసులు విధించిన ఆంక్షలను కొందరు ఉల్లంఘించారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు మొత్తం 113 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. నోటీసుల మేరకు వారు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది.