శావల్యాపురం మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఒక్కొక్క పనికి ఒక రేటు, సిబ్బంది వసూళ్లపై వచ్చిన ఆరోపణలపై ఆర్డీఓ మధులత శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి విచారణ చేపట్టారు. మండలంలోని మతుకుమల్లికి చెందిన ముండ్రు పేరమ్మ కుటుంబ సభ్యుల దృవ పత్రం కోసం విజ్ఞప్తి చేసుకుంటే, డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేశారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు.