నరసరావుపేట సంక్రాంతి పండుగ వేడుకల పేరుతో జిల్లాలో ఎక్కడైనా జూదం కోడిపందాలు నిర్వహిస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. గతంలో నిర్వాహకులపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు కావద్దన్నారు. సమాచారం ఉంటే 112కు వెంటనే తెలియజేయాలన్నారు.