నరసరావుపేట డిపో నుంచి ఈ నెల 14న జరగనున్న సింగరకొండ తిరునాళ్ళకు ప్రత్యేక బస్సులు నిర్వహిస్తామని డీఎం బీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటన లో తెలిపారు. 12 ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. అడ్డ రోడ్డు, ఏల్చూరు, కొమ్మాలపాడు మీదగా సింగరకొండకు బస్సులు వెళ్ళతాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.