స్వచ్ఛ - నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 11వ వార్డు ప్రకాష్ నగర్ పార్క్ బజార్ లో మీనాక్షి టవర్స్ వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా కాలువలోని పూడిక తీసి మురుగు నీరు పారేలా చేశారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆ ప్రాంతంలోని రోడ్లను పరిశుభ్రం చేశారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా కార్మికులకు అందజేయాలని కోరారు.