తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించారు.