తంగేడుమల్లి కాలువ పనులకు ప్రారంభం

82చూసినవారు
తంగేడుమల్లి కాలువ పనులకు ప్రారంభం
నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు రొంపిచర్ల–తంగేడుమల్లి మేజర్ కాలువ ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. కాలువల శుభ్రత, రిటైనింగ్ వాల్స్ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. వైసీపీ హయాంలో పట్టించుకోని కాలువలను ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రైతులకు రూ. 20, 000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్