పల్నాడు జిల్లాలో శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్ది జరుపుకునేలా వినాయక మండప కమిటీ నిర్వహణ సభ్యులతో ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగిందన్నారు.