వెలగపూడి సచివాలయంలో జూన్ 19న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. జూన్ 21న విశాఖపట్నంలో యోగా డే నిర్వహణ, అందులో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తాజా సమాచారం ప్రకారం, కేబినెట్ సమావేశం జూన్ 24న జరగనుంది. ప్రతీ నెలలో రెండుసార్లు కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.