నరసరావుపేటలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారి పర్యటన

70చూసినవారు
నరసరావుపేటలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారి పర్యటన
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆమె జిల్లా కలెక్టర్ ను కలిసి, జిల్లా గిరిజన జనాభా స్థితిగతులు, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల లభ్యత, ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు, ఆదాయ మార్గాలు, ఇళ్ల నిర్మాణం, పాలన వ్యవస్థలో గిరిజనుల భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్