మాచర్లకు చెందిన అమరలింగేశ్వరరావును మాలిలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. జూలై 1న ఏస్ నగరంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆయనతో పాటు మరో ముగ్గురిని అపహరించారు. అమరలింగేశ్వరరావు గత 11 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. తమ కుమారుడిని రక్షించాలంటూ కుటుంబసభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలవగా, ఆయన విదేశాంగ శాఖకు లేఖ రాశారు.