మార్టూరులో 147 మద్యం సీసాలు స్వాధీనం

66చూసినవారు
మార్టూరులో 147 మద్యం సీసాలు స్వాధీనం
అక్రమంగా నిల్వచేసి విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను మార్టూరు సీఐ రాజశేఖరరెడ్డి ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మార్టూరు మండల పరిధిలోని కొనిదెన రోడ్డులో అక్రమంగా ఓ గదిలో మద్యం బాటిళ్లు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు మార్టూరు సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడి చేసి 147 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్