ఈనెల 18న చెరుకూరులో కంటి వైద్య శిబిరం

67చూసినవారు
ఈనెల 18న చెరుకూరులో కంటి వైద్య శిబిరం
పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో ఈనెల 18న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం తెలియజేసారు. కంటి సమస్యలు, శుక్లాలు ఉన్నవారు ఈ వైద్య శిబిరానికి రావాలన్నారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్