ఇంకొల్లు మండలంలోని శివబ్రహ్మ కాలనీకి చెందిన గోనుగుంట వేద వతి అనే మహిళా బుధవారం అర్ధరాత్రి వారి స్వగృహంలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అంగన్వాడీ ఆయాగా అలాగే సాయంత్రం వేళ పాల కేంద్రంలో గుమస్తాగా పని చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.