ఇంకొల్లు: టీ 20కి నాగండ్ల యువకుడు ఎంపిక

78చూసినవారు
ఇంకొల్లు: టీ 20కి నాగండ్ల యువకుడు ఎంపిక
ఇంటర్నేషనల్ ఇండో- నేపాల్ టీ 20 ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీలకు ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన యువకుడు సంతోష్ ఎంపికయ్యాడు. ఈ మేరకు శనివారం అతనికి ఆల్ ఇండియా క్రికెట్ ట్రస్ట్ అసోసియేషన్ నుండి ఎంపిక పత్రం అందింది. మే 26 నుంచి 31 వరకు నేపాల్ లో జరగనున్న సిరీస్ లో సంతోష్ ఇండియా తరుపున ఆడనున్నాడు. సంతోష్ ను గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్