పర్చూరు ఆర్వోకు మెమో జారీకి ఆదేశాలు

53చూసినవారు
పర్చూరు ఆర్వోకు మెమో జారీకి ఆదేశాలు
సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై బుధవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో రోల్ అబ్జర్వర్ ఏ. సూర్యకుమారి ఆర్వోలు, ఏఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కానీ పర్చూరు రిటర్నింగ్ అధికారికి మెమో జారీ చేయాలని ఆమె ఆదేశించారు. పర్చూరు, చీరాల,వేమూరు నియోజకవర్గాలలో బిఎల్ఓల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగ నిష్పత్తి సరిగ్గా లేకపోవడంపై ఆమె నిలదీశారు. అధికారులు నిర్లిప్తంగా ఉంటే కుదరదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్