పర్చూరు పరిధిలోని కొత్తపాలెం గ్రామస్థులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మంగళవారం కలిసి సమస్యలపై విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గ్రామ సర్పంచ్ పాలపర్తి బూసిరెడ్డి, కొమరగిరి, చెంచయ్య, పలువురు గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.