మార్టూరు: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

85చూసినవారు
మార్టూరు: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
మార్టూరులోని క్యాంపు కార్యాలయం నందు సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అర్జీలను అధికారులకు పంపించి వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సాంబశివరావు ప్రజలకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్