బాపట్ల జిల్లా మార్టూరులోని నెహ్రూనగర్ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శనివారం రాత్రి చేసిన పూజల ఆనవాళ్లు ఆదివారం కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎర్రటి గుడ్డపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గాజులు ఉండటంతో చేతబడి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మార్గంలో వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు.