ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకోగా అది దొరికిన ఆటో డ్రైవర్ పోలీసుల సమక్షంలో ఆమెకు అప్పగించిన ఘటన బుధవారం సాయంత్రం పర్చూరులో జరిగింది. రాణి గుంటూరు నుండి పర్చూరు మీదుగా ఇంకొల్లు వెళుతుండగా హ్యాండ్ బ్యాగ్ జారి పోయింది. వెనకనే వస్తున్న రంగా అనే ఆటో డ్రైవర్ కి ఆ బ్యాగు దొరికింది. దాన్ని రంగా పర్చూరు ఎస్సై మాల్యాద్రికి అప్పగించగా ఆయన చిరునామా కనిపెట్టి బాధితురాలికి అందజేశారు.