మార్టూరులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి 300 కిలోల కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం అఖండ జ్యోతిని వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నార్నెపాటి మృత్యుంజయ శాస్త్రి తెలిపారు. దేవాలయంలోని శివలింగాన్ని బెంగుళూరులోని లక్ష రూపాయల విలువైన పూలతో అందంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పూజలు చేశారు.