పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాలను గురించి సాంబశివరావు లోకేష్ కు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల పై చర్చించారు.