పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం విజయవాడలో సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మిని కలిశారు. నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన ఇనాం భూముల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కమిషనర్ ను కోరారు. నియోజకవర్గంలో గత 70, 80 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేసుకుంటున్న ఇనాం భూములకు పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు.