ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. శనివారం పర్చూరు మండల కేంద్రంలో బాబు షూరిటీ. మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి పాలనలో ప్రభుత్వం చేసిన మోసాలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. పర్చూరు సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.