కారంచేడు మండలం స్వర్ణ జిల్లా పరిషత్ హైస్కూల్ లో మంగళవారం కారంచేడు ఎస్సై వెంకట్రావు విద్యార్థులకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా యువత సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనతో ఉండి వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.