పర్చూరు: సమీక్షలు,సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

64చూసినవారు
పర్చూరు: సమీక్షలు,సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం రోజంతా తన క్యాంపు కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 37 మందికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అలాగే ఎస్సీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల విద్య, ఉద్యానవన, మండల అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించి పాలనాపరమైన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్