మార్టూరు మండల వ్యవసాయశాఖాధికారిగా రామినేని లావణ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంతమాగులూరు ఏఓ గా విధులు నిర్వహిస్తున్న లావణ్య సాధారణ బదిలీలలో భాగంగా మార్టూరు కి బదిలీ అయ్యారు. అనంతరం సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. రైతు సేవాకేంద్ర పరిధిలోని అర్హులైన ప్రతి రైతు వేలిముద్రలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సమాచారాన్ని ప్రతి గ్రామంలో దండోరా వేయించి రైతులకు తెలియజేయాలని కోరారు.