పర్చూరు మండలం ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జోరుగా సాగుతున్నాయి. తిరునాల సందర్భంగా గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇసుక బస్తాలతో ఉన్న చక్రాలు తిరగని ఎడ్ల బండిని నిర్ణీత సమయంలో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. విజయం సాధించిన జతలకు వరుసగా రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు బహుమతులు ఉంటాయన్నారు.