75 త్యాళ్లూరు హైస్కూల్ కు స్వచ్చబారత్ రిక్షా బహుకరణ

79చూసినవారు
75 త్యాళ్లూరు హైస్కూల్ కు స్వచ్చబారత్ రిక్షా బహుకరణ
పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జడ్పి హైస్కూల్ కు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాల నిర్వహణకు 27వేలవిలువగల రిక్షాను ప్రముఖ దాతలు మైత్రి బ్రదర్స్ జొన్నల శ్రీరామ్ పాపిరెడ్డి, గుత్తికొండ శివసుందర్ రెడ్డిల తరపున వారి సోదరుడు శివనాగిరెడ్డి శనివారం పాఠశాలకు అందజేశారు. స్వచ్చపాఠశాల నిర్వహణలో తడి చెత్త పొడిచెత్త డంపింగ్ యార్డుకు చేర్చడానికి ఇది ఉపయోగ పడుతుంది. దాతలకు హెచ్ఎం ఎ. శ్రీనివాస రెడ్డి పీసీ చైర్మన్ జీ. శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్