అచ్చంపేట మండలం జడపల్లి మోటుతండా వద్ద కృష్ణానది ఒడ్డున సారా స్థావరంపై శనివారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నింది తుడు చిన్న కొండనాయక్ పరారయ్యాడని సీఐ తులసి తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ నాటు సారాయి తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.