అచ్చంపేట: పూరిల్లు దగ్ధం

64చూసినవారు
అచ్చంపేట: పూరిల్లు దగ్ధం
అచ్చంపేట మండలంలోని వేల్పూరు ఎస్సీ కాలనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. మరో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఎస్సీ కాలనీలోని కోటయ్య పొగాకు బ్యారన్ పనులకు వేరే ప్రాంతం వెళ్లాడు. ఆయన ఇంటికి మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. బహిర్భూమికి వెళ్లినవారు సిగరెట్ వెలిగించి, ముళ్లపొదల్లో వేయడంతో మంటలు చెలరేగి, ఇంటికి అంటుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్