అమరావతి స్థానిక హిందూ శ్మశానవాటిక దాటిన తరువాత కృష్ణానదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహిళకు సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని భావిస్తున్నారు. అమరావతి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. మహిళ ఎర్రరంగు జాకెట్, బ్రౌన్ కలర్ లోలంగా ధరించి ఉంది.