పల్నాడు జిల్లా పోలీస్ శాఖ వాడిన పాత వాహన పరికరాలను (సామానులు) వేలం ద్వారా విక్రయించనుంది. గురువారం ఉదయం 10: 30 గంటలకు నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలం జరగనుందని ఎస్పీ బుధవారం తెలిపారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి ఉన్నవారిని అధికారులు ఆహ్వానిస్తున్నారు.