పద్మశాలి సంఘ పెదకూరపాడు నియోజకవర్గ అధ్యక్షునిగా చెన్నంశెట్టి బాజీ ని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్, సత్యం నుండి నియామక పత్రాన్ని బాజీ అందుకున్నారు. ఎన్నికైన బాజీని సంఘ నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం బాజీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తామన్నారు.