సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం లబ్ధిదారులకు అందించారు. ఆయన కార్యాలయంలో 8 మందికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సిఫారసు లేఖ ద్వారా మంజూరైన 6, 77, 744 రూపాయల విలువైన చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏ రమేష్, అమరావతి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విష్ణు తదితరులు పాల్గొన్నారు.