డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు తహశీల్దార్ డానియల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, అధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని సహకరించాలని కోరారు.