క్రొసూరు: ప్రతిరోజు యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం: డాక్టర్

60చూసినవారు
క్రొసూరు: ప్రతిరోజు యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం: డాక్టర్
క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సిరి చందన శనివారం యోగా ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించారు. యోగాసనాలు క్రమ పద్ధతిలో చేస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతిరోజు యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుందని సిరి చందన తెలిపారు. యోగ శిక్షకురాలు రజిని ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక యోగాసనాలలో ఎలా చేయాలో చేసి చూపించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్