ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్ఫ్ బోర్డు సవరణ వెనక్కి తీసుకోవాలి. కోసూరులో శుక్రవారం స్థానిక ముస్లింలు వర్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం నమాజ్ తర్వాత నాలుగు రోడ్ల సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమై, ప్రధాన వీధుల్లో సాగింది. పెద్ద సంఖ్యలో మహిళలు సహా నిరసనకారులు జాతీయ, నల్ల రిబ్బన్లు ధరించి చట్ట సవరణపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.