అమరేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ఎల్లప్పుడు తోడ్పడతానని కమిషనర్ కుమారి అన్నారు. అమరావతిలో కొలువైన అమరేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ గా కుమారి కర్రెద్దుల రేఖ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన సునీల్ కుమార్ బదిలీపై వెళ్లారు. నూతన బాధ్యతలు చేపట్టిన రేఖను పలువురు ఆలయ సిబ్బంది నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.