కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా క్రోసూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం ఎమ్మెల్యే ప్రవీణ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్ల అంధకారాన్ని తొలగించి సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసినట్లు తెలిపారు. రూ. 84 కోట్లతో అభివృద్ధి పనులు, యువతకు స్కిల్ హబ్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.