పెదకూరపాడు: జ్యోతిరావ్ ఫూలే ఆశయలను పాటించాలి: ఎమ్మెల్యే

55చూసినవారు
పెదకూరపాడు: జ్యోతిరావ్ ఫూలే ఆశయలను పాటించాలి: ఎమ్మెల్యే
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ఒక్కరు పాటించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాష్యం మాట్లాడుతూ.. ఫూలే సామాజిక సమానత్వ పోరాటం, మహిళలు, వెనుకబడిన వర్గాల విద్యా హక్కు కోసం ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

సంబంధిత పోస్ట్