నాదెండ్ల: పదెకరాల వరిగడ్డి వామి దగ్ధం

64చూసినవారు
నాదెండ్ల: పదెకరాల వరిగడ్డి వామి దగ్ధం
నాదెండ్ల మండలం సాతులూరులో శనివారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 ఎకరాల్లో వరి గడ్డి వామి దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు ఈదర సాంబశివరావు ఇటీవల రూ. లక్ష పైగా వెచ్చించి 10 ఎకరాల వరిగడ్డిని కొనుగోలు చేశాడు. సాయంత్రం సమయంలో వామి నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న నరసరావుపేట అగ్నిమాపక అధికారులు శకటంతో వచ్చి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్