రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పల్నాడు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంటా గోపి డిమాండ్ చేశారు. శనివారం పెదకూరపాడు అంబేద్కర్ సెంటర్లో లక్ష అంబేద్కర్ నామస్మరణ చేపట్టాడు. ఆయన మాట్లాడుతూ భాజాపా అధికారంలోకి వచ్చిన పదేళ్ల నుండి రాజ్యాంగాన్ని, రచించిన అంబేద్కర్ ను అవమానపరచారన్నారు. తోడేటి సందీప్, ప్రసాద్, గడ్డం రవికిరణ్, కోపూరి రవి, మారుతి ఉన్నారు.