అమరావతి 'దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని' అంటూ మహిళలను కించపరిచేలా సాక్షి టీవీలో మాట్లాడడం సిగ్గుచేటని పెదకూరపాడులో మంగళవారం మహిళలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు, బెలూన్లతో మంగళవారం భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. మహిళలను అవమానించిన సాక్షి ఛానల్, పేపర్ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.