పెదకూరపాడు మండలం పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గిరిబాబు ఆదివారం హెచ్చరించారు. వాహనాలకు సైలెన్సర్లు తీసి ప్రధాన వీధులలో తిప్పుతూ హల్చల్ చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. వాహనదారులు సరైన పత్రాలను కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.