పెదకూరపాడు మండల పరిధిలోని బలుసుపాడు కాలచక్ర రహదారి పక్కన చెత్తకుప్పలో ప్రభుత్వ ఆసుపత్రి మందులు కుప్పలు కుప్పలుగా పడేసారని ఆదివారం ప్రజలు తెలిపారు. ప్రజలకు సకాలంలో పంపిణీ చేయవలసిన మందులు కాలం చెల్లు బాటు అయ్యేంత వరకు ఏఎన్ఎం, ఆశాలు మందులు ఇళ్లల్లో ఉంచుకొని కాలం తీరిపోయాక చెత్తకుప్పల పాలు చేస్తున్నారని ప్రజలు మండిపడ్డారు. కొన్ని ముందు సీసాలు జులై 25 వరకు సమయం ఉన్నా చెత్త కుప్పల్లోనే వేశారని అన్నారు.