పెదకూరపాడులో కాటూరి హాస్పటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును బుధవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి భారీ స్పందన లభించింది. అనుభవజ్ఞులైన కాటూరి హాస్పటల్ వైద్య సిబ్బంది.. ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.