పెదకూరపాడు నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించేలా చూస్తామని లోకేశ్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.