తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో ఆదివారం నాడు తుళ్లూరు ట్రాఫిక్ సీఐ కోటేశ్వరావు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పిఎస్ కు తరలించారు. ఈ నేపథ్యంలో సిఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ. తాగి వాహనాలు నరికితే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ఈ సందర్భంగా ఆయన తెలిపారు.